Social 1080×1350 • Multi-page
31-07-2025 BREAKING NEWS 12:50 PM
swarnodayam.com
Telugu Daily News

డిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు ఈశ్వర్ రెడ్డికి మాతృ వియోగం.. పలువురి పరామర్శ

డిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు ఈశ్వర్ రెడ్డికి మాతృ వియోగం.. పలువురి పరామర్శ
IMG_20250731_124744

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు, సామాజిక ఉద్యమ నాయకుడు పలకల ఈశ్వర్ రెడ్డికి మాతృమూర్తి పలకల మల్లమ్మ నిన్న పరమపదించినారు. ఈరోజు ఉదయం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలోని వారి స్వగృహములో భౌతిక కాయన్నీ పలువురు సందర్శించి నివాళులర్పించారు. ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండలురెడ్డి, సోమన్న, బిఆర్ఎస్ నాయకులు రావుల రాజలింగారెడ్డి మరియు పాక సతీష్ సందర్శించిన వారిలో ఉన్నారు. అలాగే స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, డిటిఎఫ్ సైదాపూర్ మండల శాఖ అధ్యక్షుడు మండల సదాశివ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

మల్లమ్మ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న బండ శ్రీనివాస్, పాక సతీష్, కొండల రెడ్డి, రాజలింగారెడ్డి, సోమన్న తదితరులు..

ఈశ్వర్ రెడ్డి కి మాతృవియోగం


డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు,సామాజిక ఉద్యమకారులు పల్కల ఈశ్వర్ రెడ్డి మాతృమూర్తి పల్కల మల్లమ్మ(90) తీవ్ర అనాతోగ్యంతో గురువారం ఉదయం 3 గంటలకు వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేశవపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో మల్లమ్మ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని ఈశ్వర్ రెడ్డి ఫోన్ ద్వారా తెలిపారు. మల్లమ్మ భర్త పల్కల సాంబశివరెడ్డి గత కొంతకాలం క్రితమే మరణించారు. మల్లమ్మకి ముగ్గురు కుమారులు వరుసగా పల్కల వీరరాఘవరెడ్డి(న్యాయవాది), పల్కల రాజిరెడ్డి, పల్కల ఈశ్వర్ రెడ్డి(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మల్లమ్మ హుజురాబాద్ కు చెందిన దళిత ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించి ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులందరికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పలకల మల్లమ్మ (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!