Social 1080×1350 • Multi-page
31-07-2025 BREAKING NEWS 07:07 PM
swarnodayam.com
Telugu Daily News

పించన్ల పెంపుకై హుజురాబాద్ లో ఆగస్టు 7న మంద కృష్ణ మాదిగ సన్నాహక సభను విజయవంతం చేయాలి.. – ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజుమాదిగ

పించన్ల పెంపుకై హుజురాబాద్ లో ఆగస్టు 7న మంద కృష్ణ మాదిగ సన్నాహక సభను విజయవంతం చేయాలి.. – ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజుమాదిగ
Oplus_16908288

– హుజురాబాద్‌లో ఎమ్మార్పీఎస్, వికలాంగుల నాయకులతో సన్నాహక సమావేశం

– హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల మండలాల ఇన్చార్జులు హాజరు

– గ్రామ గ్రామాల నుండి అన్ని వర్గాల పించన్ దారులకు ఆహ్వానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రతాప సాయి గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ ఇన్చార్జిలతో ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ మరియు మానకొండూరు నియోజకవర్గాల, మండలాల ఇన్చార్జులు పాల్గొన్నారు. సమావేశ ప్రధాన ఉద్దేశం, వికలాంగులకు అందుతున్న ఆసరా పింఛన్ పెంపు కోసం ఆగస్టు 13న హైదరాబాద్ LB స్టేడియంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించనున్న “సింహగర్జన సభ”ను విజయవంతం చేయడం కోసం ఆ సభకు ముందుగా ఆగస్టు 7న హుజురాబాద్ లో జరగనున్న సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఆ రోజు సభకు మందకృష్ణ మాదిగ స్వయంగా హాజరుకానున్నారు. సభలో ఎమ్మార్పీస్ కరీంనగర్ జిల్లా ఇంచార్జి మాదిగ రాజు మాట్లాడుతూ “వికలాంగుల ఆర్థిక భద్రతకు ఆసరా పింఛన్‌ పెంపు అత్యంత అవసరం అని, ప్రభుత్వానికి మా డిమాండ్లు వినిపించాలంటే ప్రజల మద్దతుతో గళం విప్పాలి,” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజుమాదిగ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదిగ, హుజురాబాద్ మండలం ఇన్చార్జీలు మొలుగూరి అశోక్ మాదిగ, కో ఇన్చార్జ్ రోంటాల రాజుమాదిగ, జమ్మికుంట మండల ఇన్చార్జులు అంబాల రాజుమాదిగ, మిట్టపల్లి రాజేష్ మాదిగ కో ఇన్చార్జి, ఇల్లంతకుంట మండలం ఇన్చార్జి ఎర్ర ఆదిత్య మాదిగ, వీణవంక మండల ఇన్చార్జీలు దేవునూరి రవీందర్ మాదిగ, విహెచ్పిఎస్ ఇన్చార్జులు అంతడుపుల సంపత్ మాదిగ, వడ్డేపల్లి రమేష్ మాదిగ, హుజురాబాద్ మండల అధ్యక్షులు, దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకుల సన్నాహక సమావేశం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!