Social 1080×1350 • Multi-page
31-07-2025 BREAKING NEWS 08:31 PM
swarnodayam.com
Telugu Daily News

ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబాకు తెలంగాణ ఎంప్లాయిస్ గేజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ టీచర్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ముజాహిద్ హుస్సేన్ ఘన సన్మానం

ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబాకు తెలంగాణ ఎంప్లాయిస్ గేజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ టీచర్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ముజాహిద్ హుస్సేన్ ఘన సన్మానం
IMG-20250731-WA0074

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ లో నీతి నిజాయితీతో 34 సంవత్సరాలు పనిచేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీ మహమ్మద్ గౌస్ బాబా పదవి విరమణ చేసిన సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ గేజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మహమ్మద్ గౌస్ బాబాకు శాలువాతో పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ మొహమ్మద్ గౌస్ బాబా 1991 సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి పోస్టు కమాన్ పూర్ అక్కడి నుండి సైదాపూర్ మరియు హుజురాబాద్ నుండి ఎస్బిఐ ఏసీబీ సీఐగా అక్కడనుండి ఇంటలిజెన్స్ అక్కడి నుండి హుజురాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఏసిపి ప్రమోషన్ తీసుకొని మంచిర్యాల్ ఎసిపి గా అక్కడి నుండి మెట్టుపల్లి ఏసిపి పనిచేస్తూ అక్కడి నుండి బదిలీ కరీంనగర్ ఇంటలిజెన్స్ ఏసిపి గా పనిచేస్తూ అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొంది జులై 31 గురువారం రోజు పదవి విరమణ పొందిన మహమ్మద్ గౌస్ బాబా పోలీస్ శాఖలో 34 సంవత్సరాలు పని చేసిన ఎక్కడ పని చేసిన కూడా అక్కడి ప్రజలు ఈరోజు వరకు కూడా మొహమ్మద్ గౌస్ బాబాను గుర్తిస్తారు పోలీస్ శాఖలో నీతి నిజాయితీతో ఎంతో మంచి పేరు సంపాదించిన మహమ్మద్ గౌస్ బాబా ఈరోజు పదవి విరమణ పొందటం చాలా సంతోషం 34 సంవత్సరాలు పోలీస్ శాఖలో పనిచేసి పదవి విరమణ ఈరోజు పొందిన మహమ్మద్ గౌస్ బాబాకు పోలీస్ శాఖ ద్వారా 150 అవార్డులు పొందినారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజి, డిఐజి ,సిపి, ఎస్పీల చేతుల మీద ఎన్నో ప్రశ్న పత్రాలు అందుకున్నారన్నారు. ఇలాంటి నీతి నిజాయితీ పేరు గల అధికారిగా మహమ్మద్ గౌస్ బాబా పోలీస్ శాఖలో ఎంతో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న అయినా 34 సంవత్సరాల సర్వీసులో ఒక గుంట భూమి కూడా కొనలేదనీ, సొంత ఇల్లు కూడా లేదు అన్నారు. కానీ అయినా పని చేసిన ప్రాంతాలలో అక్కడి ప్రజల హృదయాలలో పేరు, గుర్తింపు పొందిన వ్యక్తి మహమ్మద్ గౌస్ బాబా అని తెలంగాణ ఎంప్లాయిస్ గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గజిటెడ్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జెయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. మహమ్మద్ గౌస్ బాబా పదవి విరమణ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ల శాఖలకు చెందిన అధికారులు, పోలీస్ శాఖలో పనిచేస్తున్న లాండ్ ఆర్డర్, ఏసీబీ స్పెషల్ బ్రాంచ్, సిబిసి ఎడి ఇంటలిజెన్స్, ప్రజా ప్రతినిధులు పాల్గొనగా ముఖ్యఅతిథిగా హుస్నాబాద్ ఏసిపి సదానందం, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి శ్రీనివాస్, మాజీ ఏసీబీ డిఎస్పి వెంకటరమణ, కరీంనగర్ టిఎన్జిఓ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పత్రిక విలేకరులు, మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబాను సన్మానిస్తున్న తెలంగాణ ఎంప్లాయిస్ గేజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ టీచర్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ముజాహిద్ హుస్సేన్…

గౌస్ బాబాను సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!