Social 1080×1350 • Multi-page
01-08-2025 BREAKING NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News

వందరోజుల పనులను తనిఖీ చేసిన మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సాయినాథ్.. – మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు.

వందరోజుల పనులను తనిఖీ చేసిన మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సాయినాథ్.. – మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు.
IMG-20250801-WA0070

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి

,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో జరుగుతున్న 100 రోజుల పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ వి. సాయినాథ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో జమ్మికుంట రోడ్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక మొక్కను నాటారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి జరుగుతున్న పనులను ఆయన మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీకి పారిశుధ్యం కోసం వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా హుజురాబాద్ కు 1.73 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వాటి ఖర్చు చేస్తే మరిన్ని నిధులు మంజూరు అవుతాయని అన్నారు. పట్టణంలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, పలువురు వార్డు ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

మొక్కలు నాటి నీళ్ళు పోస్తున్న మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సాయినాథ్..

Oplus_16908288
మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులు సిబ్బందితో మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సాయినాథ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!