Social 1080×1350 • Multi-page
01-08-2025 BREAKING NEWS 09:58 PM
swarnodayam.com
Telugu Daily News

గుమ్మడి మల్లేశం సేవలు కలకాలం గుర్తుండిపోతాయి.. – కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్.

గుమ్మడి మల్లేశం సేవలు కలకాలం గుర్తుండిపోతాయి.. – కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్.
IMG_20250801_215533

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ గొల్లపల్లి శాఖ మేనేజర్ గా విధులు నిర్వహించిన గుమ్మడి మల్లేశం ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం రోజున కరీంనగర్ kdcc కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాబ్ చైర్మన్ కోడూరి రవీందర్, వైస్ చైర్మన్ పింగిలి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుమ్మడి మల్లేశం ఉద్యోగ విరమణ తర్వాత తాను మంచి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలన్నారు, మల్లేశం అటెండర్ స్థాయి నుంచి మేనేజర్ వరకు ఎదగడం చాలా గొప్పదన్నారు. గౌరవం ఇవ్వడంలో నాంది మల్లేశం .చదువుతో పని లేకుండా ట్యాలెంట్ లో పైకొచ్చిన వ్యక్తి అన్నారు. అయన వినయ విధేయతతో పనిచేసి ఉద్యోగ ధర్మం పాటించిన గొప్ప వ్యక్తి మల్లేశం అన్నారు. వారు బ్యాంక్ యొక్క విధివిధానాలు పాటిస్తు సేవలందించారన్నారు. కెడిసిసి సంస్థ ఉన్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. 30 సంవత్సరాలు బ్యాంకు సేవలు అందించి రిటైర్మెంట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పని చెప్పిన అంకితభవంతో పనిచేశారన్నారనీ మల్లేషమును కొనియాడారు.

మల్లేశం దంపతులకు శాలువా కప్పి సత్కరిస్తున్న కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!