Social 1080×1350 • Multi-page
01-08-2025 BREAKING NEWS 11:15 PM
swarnodayam.com
Telugu Daily News

తిరుపతిలో మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ తో ప్రెస్ స్టిక్కర్లు అందజేత

తిరుపతిలో మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ తో ప్రెస్ స్టిక్కర్లు అందజేత
IMG-20250801-WA0085

స్వర్ణోదయం ప్రతినిధి తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి హర్షవర్ధన్ రాజు IPS ఆదేశాలపై, క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక ప్రెస్ స్టిక్కర్లు మీడియా ప్రతినిధులకు అందజేయడం జరిగింది.

ఈ స్టిక్కర్లను స్కాన్ చేస్తే, పాత్రికేయుల పేరు, వారు పనిచేస్తున్న మీడియా సంస్థ పేరు, డిజిగ్నేషన్, కలెక్టర్ ఇచ్చిన గుర్తింపు (అక్రిడేషన్) నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏర్పాటుతో నకిలీగా ప్రెస్ అంటూ తిరుగుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రెస్ స్టిక్కర్లు పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా తయారు చేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ, నిజమైన విలేకరుల హక్కులను కాపాడేలా జిల్లా ఎస్పీ చేసిన ఈ చర్య అభినందనీయమన్నారు.

క్యూఆర్ కోడ్ తో ఉన్న ప్రెస్ స్టిక్కర్లు అందజేస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!