Social 1080×1350 • Multi-page
02-08-2025 BREAKING NEWS 04:21 PM
swarnodayam.com
Telugu Daily News

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన… – ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి.. – ఎఫ్ బిఎస్, పిఎల్ బిఎస్ పరీక్షలు ఉచితం..- డాక్టర్ శ్రీకర్.

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన… – ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి.. – ఎఫ్ బిఎస్, పిఎల్ బిఎస్ పరీక్షలు ఉచితం..- డాక్టర్ శ్రీకర్.
IMG-20250802-WA0060

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్ అన్నారు. శనివారం హుజురాబాద్ లోని శ్రీరామ హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ శిబిరానికి హుజురాబాద్ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ఎఫ్ బిఎస్, పిఎల్ బిఎస్ ఉచిత పరీక్షలతో పాటు ప్రతి మంగళవారం ఉచితంగా ఓపి చూస్తామని అన్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తాగే నీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారు. నేటి సమాజంలో చాలామంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారని, షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలని కోరారు. షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగితే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి నెలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు. ఉచిత వైద్య శిబిరం ద్వారా సుమారు 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ఆస్పత్రి యాజమాన్యం నంబి భరణి కుమార్, ముష్కే శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

శ్రీరామ ఆస్పత్రికి తరలివచ్చిన ప్రజలు…

Oplus_16908288

ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్న ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!