Social 1080×1350 • Multi-page
03-08-2025 BREAKING NEWS 07:32 PM
swarnodayam.com
Telugu Daily News

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ.. – మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్ లకు స్వాగతం పలికిన ప్రణవ్.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ.. – మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్ లకు స్వాగతం పలికిన ప్రణవ్.
IMG_20250803_192556

– రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (శంకరపట్నం): చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని, పదేళ్ల నిరీక్షణకు 18 నెలల్లో పరిష్కారం చూపించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజున మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు హెలిప్యాడ్ వద్ద ప్రణవ్ సాదరంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండాలని నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియా ప్రారంభించిందని ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందజేస్తామని తెలిపారు.

మంత్రులకు ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్…

మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

రేషన్ కార్డుల పంపిణీలో మంత్రులతో కలిసి పాల్గొన్న ప్రణవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!