Social 1080×1350 • Multi-page
04-08-2025 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

గద్దర్ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయండి.. – సీనియర్ కళాకారుడు శనిగరం బాబ్జి

గద్దర్ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయండి.. – సీనియర్ కళాకారుడు శనిగరం బాబ్జి
IMG-20250804-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ రెండో వర్ధంతిని విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శనిగరం బాబ్జి పిలుపునిచ్చారు. ఈనెల 8న హుజురాబాద్‌ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరగనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.
​సోమవారం హుజురాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీడిత, తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్‌కు ఘన నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతి సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్, ప్రధాన వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం హాజరవుతారని తెలిపారు.
​ఈ సందర్భంగా, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కళాకారులచే గద్దర్‌కు ఆట, పాటల రూపంలో నివాళి కార్యక్రమం ఉంటుందని, అనంతరం అక్కడి నుండి సిటీ సెంట్రల్ హాల్ వరకు ర్యాలీగా వెళ్తామని ఆయన వివరించారు. కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని గద్దర్ ఆశయాలను స్మరించుకోవాలని బాబ్జి కోరారు. ఈ సమావేశంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, డప్పు వాయిద్య కారుడు ఎర్ర సురేష్, ప్రముఖ గాయకుడు రావుల సాయి పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శనిగరం బాబ్జి

—————————++++++++———————

&పత్రికా ప్రకటనలు&

——————++++++————————

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!