Social 1080×1350 • Multi-page
05-08-2025 BREAKING NEWS 09:36 PM
swarnodayam.com
Telugu Daily News

వికలాంగుల హక్కుల కోసం జరిగే సన్నాహక సభను విజయవంతం చేయండి. -వికలాంగుల హక్కుల పోరాట సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి రాఘవుల శ్రీనివాస్

వికలాంగుల హక్కుల కోసం జరిగే సన్నాహక సభను విజయవంతం చేయండి. -వికలాంగుల హక్కుల పోరాట సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి రాఘవుల శ్రీనివాస్
IMG-20250805-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వికలాంగుల హక్కుల కోసం హుజురాబాద్ లో ఈ నెల 7న జరిగే సన్నాహక సభను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి రాఘవుల శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాలయాపన బాటపట్టాయని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎదురుచూస్తున్న ఆసరా పింఛన్ల పెంపు ఇంకా నెరవేరలేదని, వృద్ధుల పింఛన్లు రూ. 3,000 కి, వికలాంగులకు రూ. 6,000కి ఇతర పించన్లు కూడా పెంచుతాం… జీవనోపాధికి గౌరవంగా ఆసరా ఇస్తాం” అంటూ ఇచ్చిన హామీలు ప్రస్తుతం మాటలకే పరిమితమయ్యాయన్నారు. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటికే విడుదల చేసిన మానిఫెస్టోలో పించన్ల పెంపును ముఖ్య అజెండాగా పేర్కొని అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా, అందుకు సంబంధించి కార్యాచరణపై స్పష్టత లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13.4 లక్షల మంది వృద్ధులు, 4.57 లక్షల మంది వికలాంగులు, 13.26 లక్షల మంది వితంతువులు ఆసరా పింఛన్లు పొందుతూ ప్రతి నెలా పించను జీవనాధారం కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. “ఇన్నేళ్లు బతికి బతికి చివర్లో ప్రభుత్వానికి భారమయ్యామా?” అని వృద్ధులు వేదనతో ప్రశ్నిస్తున్నారని, కండ్లు కానలేవు, కాళ్లు నడవలేవు…అయినా జీవనాధారం కోసం నెలకు వచ్చే తక్కువ మొత్తమే ఆధారం కావడమంటే దారుణం అని ఆయన విమర్శించారు.

ఆగస్టు 7న మంద కృష్ణ మాదిగ సన్నాహక సభకు పిలుపు

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు హామీ ఇచ్చిన పించన్లు పెంచాలని కోరుతూ ఆగస్టు 7న మంద కృష్ణమాదిగ హాజరవుతున్న సన్నాహక సభకు హుజురాబాద్, మానకొండూర్ నియోజక వర్గాల నుండి తరలి రావాలని పిలుపునిచ్చారు. మహాగర్జన విజయవంతం చేయడానికి హుజురాబాద్, మానకొండూర్ నియోజక వర్గాలలో సన్నాహక సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్ఆర్పిఎస్, విహెచ్పీఎస్ నేతృత్వంలో జరిగే సభకు పించన్ దారులు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ డిమాండ్లు ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసం కావు…ఇది సామూహిక హక్కుల కోసం పోరాటం,” అని హితవు పలికారు. పించన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మౌనంగా ఉండకుండా హమీలకు బాధ్యత వహించాలని అని సభలో ప్రభుత్వానికి తగిన సందేశం వెళ్ళేలా అందరూ మంద కృష్ణ మాదిగ సన్నాహక సభలో పాల్గొనాలని ఆయన కోరారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి రాఘవుల శ్రీనివాస్

————-+++++++———————

&పత్రికా ప్రకటనలు&

——————+++++++——————-

&@వార్షికోత్సవ శుభాకాంక్షలు&@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!