Social 1080×1350 • Multi-page
06-08-2025 BREAKING NEWS 05:38 PM
swarnodayam.com
Telugu Daily News

సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్ సందేశం.. – బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్ సందేశం.. – బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు
IMG_20250806_173231

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు శ్రీవాణి అన్నారు. బుధవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ రమేష్ బాబు, తహసిల్దార్ కనకయ్య, సబ్ ట్రెజరీ అధికారి శివరామకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ సాయి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, శేఖర్ లతో పాటు సిబ్బందికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, మనం ఏర్పరచుకున్న విలువలను కాపాడుకుంటూ జీవించడం అన్నారు. పరస్పర మాటలు, దృష్టి స్వభావ సంస్కారాలు నిష్కల్మషంగా ఉండాలనే రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారని తెలిపారు. ప్రజలందరూ పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రాణి, రాజయ్య, నిరంజన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డిఓ రమేష్ బాబుకు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారిలు

తాసిల్దార్ కనకయ్యకు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారిలు…

పోస్ట్ ఆఫీస్ లో, సబ్ ట్రెజరీ ఆఫీసులో రాఖీలు కట్టి నోరు తీపి చేపిస్తున్న దృశ్యంలు

——————–++++++++++——————–

&పత్రికా ప్రకటనలు&

———————++++++——————–

#&వార్షికోత్సవ శుభాకాంక్షలు#&


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!