Social 1080×1350 • Multi-page
06-08-2025 BREAKING NEWS 07:56 PM
swarnodayam.com
Telugu Daily News

కుక్కల దాడిలో జాతీయ పక్షి (నెమలి) మృతి

కుక్కల దాడిలో జాతీయ పక్షి (నెమలి) మృతి
IMG_20250806_194706

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జనావాసాల్లో ఓ నెమలి ప్రత్యక్షమైంది. పట్టణంలోనీ ఇల్లందులవాడలో నెమలి పై విధి కుక్కలు దాడి చేయగా ఓ పాల వ్యాపారి నెమలిని విధి కుక్కల బారి నుండి కాపాడి స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స చేద్దాం అని ప్రయత్నించగా అప్పటికే నెమలి మృతి చెందింది. దీంతో మృతి చెందిన నెమలిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఫారెస్ట్ అధికారులు తరలించారు. జాతీయ పక్షి అయిన నెమలి చాలా చోట్ల జనాభాషాలో తిరుగుతూ పలువురి కంట పడుతున్న అడవి శాఖ అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదని, కొందరు నెమలులను వేటాడి చంపితింటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు జాతీయ పక్షులను వేటగాళ్ల భారి నుండి రక్షించాలని పలువురు వన్యప్రాణుల సంరక్షకులు కోరుతున్నారు.

వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన జాతీయ పక్షి నెమలి
Oplus_16908288
Oplus_16908288

చనిపోయిన నెమలిని చూపిస్తున్న అటవీ శాఖ సిబ్బంది…

Oplus_16908288

మృతి చెందిన నెమలిని పోస్టుమార్టంకు సంచిలో తరలిస్తున్న అటవీ శాఖ సిబ్బంది…

———————–++++++++——————–

&పత్రికా ప్రకటనలు&

——————————-+++++—————

#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!