Social 1080×1350 • Multi-page
06-08-2025 BREAKING NEWS 09:23 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ విద్యార్థినీ గిన్నిస్ బుక్ అఫ్ రికార్డుకు ఎంపిక

ఆల్ఫోర్స్ జీనియస్ విద్యార్థినీ గిన్నిస్ బుక్ అఫ్ రికార్డుకు ఎంపిక
IMG-20250806-WA0132

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూలులో 7వ తరగతి చదువుతున్న తాళ్లపెళ్లి చైత్ర గిన్నిస్ బుక్ రికార్డ్ కి ఎంపిక కావడంతో అల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి బుధవారం ఆ విద్యార్థిని సన్మానించాడు. అలాగే 4వ తరగతి చదువుతున్న అమ్మాయి అద్వైత రెడ్డి కరాటేలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఇద్దరిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విఎన్ఆర్ మాట్లాడుతూ.. కరాటే మరియు గిన్నిస్ బుక్ రికార్డుల విజేతలుగా మన స్కూల్ విద్యార్థులు నిలిచారనీ, ఇలానే ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో నిష్ణాతులుగా నిలవాలని, అప్పుడే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. ఇలాంటి విషయాలలో తమ పాఠశాల ఎప్పుడు విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. తదనంతరం ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Oplus_16908288

గిన్నిస్ బుక్ రికార్డ్ కి ఎంపికైన తాళ్లపెళ్లి చైత్రను అభినందిస్తున్న విఎన్ఆర్..

Oplus_16908288

కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన అద్వైత రెడ్డిని అభినందిస్తున్న విఎన్ఆర్..

ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన విఎన్ఆర్
Oplus_16908288

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వి నరేందర్ రెడ్డి…

—————+++++++++——————

&పత్రికా ప్రకటనలు&

—————–++++++——————

@&వార్షికోత్సవ శుభాకాంక్షలు&@

———————++++++++—————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!