Social 1080×1350 • Multi-page
06-08-2025 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

సమన్వయంతో నీటిపారుదల చేసుకోవాలి

సమన్వయంతో నీటిపారుదల చేసుకోవాలి
IMG_20250806_231351

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
రెండు గ్రామాల రైతులు సమన్వయంతో అవగాహనతో దేవాదుల నీటిని పారుదల చేసుకోవాలని ఘర్షణలకు తావివరాలని నీటిపారుదల శాఖ డి.ఈ ప్రశాంతి అన్నారు. సోమవారం రాత్రి నీటిపారుదల విషయంలో ఇరు గ్రామాల రైతుల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో స్వర్ణోదయం యూట్యూబ్ ఛానల్ లో రాగా అధికారులు స్పందించారు. బుధవారం హుజరాబాద్ మండలం తమ్మక్కపేట కాట్రపల్లి గ్రామాల శివారులో ఇ రు గ్రామాల రైతులతో హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ ఇరిగేషన్ శాఖ అధికారులు కలిసి రెండు గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ సంబంధించిన నీటిని వంతుల వారీగా రైతులు వినియోగించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరికి సాగునీరు అవసరమని ఉన్న నీటిని వృధా కాకుండా గొడవలు లేకుండా వివాదాలకు తావివ్వకుండా సమన్వయంతో ఆలోచించి నీటిని పారించుకోవాలని అన్నారు దీనికి రెండు గ్రామాల రైతులు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో కాట్రపల్లి, దమ్మక్కపేట రైతులు కాసనగొని కిరణ్, రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ అరవిందు, లష్కర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

విచారణ జరుపుతున్న అధికారులు…

———_—————–++++++++————-

&పత్రికా ప్రకటనలు&

———————+++++++++————++—-

###వార్షికోత్సవ శుభాకాంక్షలు###

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!