Social 1080×1350 • Multi-page
07-08-2025 BREAKING NEWS 05:26 PM
swarnodayam.com
Telugu Daily News

వారాహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఘన సన్మానం.. – చేనేత కార్మికులను సత్కరించిన వారాహి ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్ … పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు

వారాహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఘన సన్మానం.. – చేనేత కార్మికులను సత్కరించిన వారాహి ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్ … పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు
IMG_20250807_172432

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ :హుజూరాబాద్ పట్టణంలోని రాంపూర్ గ్రామంలోగల బాపుజీ చేనేత‌ సంఘంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారాహి ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్ హాజరై బాపుజీ సంఘంలో పని చేస్తున్నటువంటి నేత కార్మికులకు టిఫిన్ బాక్స్ లతోపాటు, చేనేత కండువాలు బహుకరించి వారిని సత్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ….చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు సత్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పద్మశాలి కార్మికుల శ్రేయస్సు కొరకు నావంతు సహాయక సాకారం అందిస్తున్నానని తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడుతానని హామీ ఇచ్చిన కుడికాల భాస్కర్ గారిని చేనేత కార్మికుల నాయకులు రాజమౌళి తోపాటు మిగతా నేత కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారాహి సంస్థ డైరెక్టర్లు చిలుకమారి శ్రీనివాస్, గాజవెల్లి మనోహర్, జినుకల్ల లక్ష్మణ్ రావు, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, తెలంగాణ చౌరస్తా తెలుగు దినపత్రిక స్టేట్ కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో చీఫ్ గాజంగి అఖిల్, చెల్పూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు అడెపు సమ్మయ్య, శాలపల్లి పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు అడెపు పోచమల్లు, స్థానిక పద్మశాలి నాయకులు కురపాటి రామచంద్రం, చంద్రమౌళి, వెంకటేషం తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులను సత్కరిస్తున్న వారాహి ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్.. భాస్కర్ ను సత్కరిస్తున్న చేనేత కార్మికులు.

————————–++++++++———————-

&పత్రికా ప్రకటనలు&

——————-++++++++++++——————-

#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!