Social 1080×1350 • Multi-page
07-08-2025 BREAKING NEWS 06:43 PM
swarnodayam.com
Telugu Daily News

మామిండ్లవాడలో కార్డన్ సెర్చ్– అనుమానాస్పద 76 వాహనాల స్వాధీనం.. అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకే ఆకస్మిక తనిఖీలు అడిషనల్ డీసిపి

మామిండ్లవాడలో కార్డన్ సెర్చ్– అనుమానాస్పద 76 వాహనాల స్వాధీనం.. అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకే ఆకస్మిక తనిఖీలు అడిషనల్ డీసిపి
IMG-20250807-WA0103

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 07 : పట్టణంలోని మామిండ్లవాడ కాలనీలో గురువారం భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు పలు ఇళ్లలో తలుపులు తట్టి తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా ఉంచిన 55 ద్విచక్ర వాహనాలు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 3 కార్లు, 2 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ…యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అద్దెకు ఇల్లు ఇవ్వబోయే వారు ముందుగా వ్యక్తుల గుర్తింపు పత్రాలు పరిశీలించాలన్నారు. అనుమానాస్పదంగా కన్పించే వ్యక్తులు కనిపించిన వెంటనే 100 నెంబరుకు సమాచారం ఇవ్వాలి అని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలన అరికట్టేందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి యువత గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ అరికట్టేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను డిసిపి, ఏసిపి, పోలీసు అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ వాసంశెట్టి మాధవి, నలుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సుమారు 100 మంది పోలీస్ సిబంది పాల్గొన్నారు. పోలీసుల ఈ చర్యలతో స్థానికుల్లో భద్రతాపట్ల నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది.

కార్డెన్ సెర్చ్ ను పరిశీలిస్తున్న ఏసిపి మాధవి..

మత్తు పదార్థాల నిషేధంపై రూపొందించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఏ డిసిపి, ఏసిపి, సీఐలు, ప్రజాసంఘాల నాయకులు..

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న అడిషనల్ డీసీపీ వెంకటరమణ, పక్కన ఏసిపి మాధవి, సిఐలు……

Oplus_16908288
Oplus_16908288

ఏలాంటి కాగితాలు లేకుండా కొనసాగిస్తున్న ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Oplus_16908288

——————-++++++++———————

&పత్రికా ప్రకటనలు&

—————++++++++——————–

#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!