Social 1080×1350 • Multi-page
08-08-2025 BREAKING NEWS 07:15 PM
swarnodayam.com
Telugu Daily News

అల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో.. ముందస్తు రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వేడుకలు

అల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో.. ముందస్తు రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వేడుకలు
IMG-20250808-WA0126

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌ లో శుక్రవారం ముందస్తు రక్షాబంధన్ పండుగను అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టి సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, పరస్పర రక్షణ భావాన్ని చాటిచెప్పారు. అలాగే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బాలికలు సాంప్రదాయ వస్త్రధారణలో లక్ష్మి, అమ్మవారి వేషధారణలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ వేడుకల ద్వారా విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పండుగని తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటామని, తన పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సోదరి సోదర భావం కలిగేలా క్రమశిక్షణతో మెలుగుతారని అలాగే కేవలం మన సొంత వారితోనే కాకుండా అందరితో సోదర భావంతో మెలగాలని అప్పుడే మన భారతీయ సాంప్రదాయ విలువలతో మరింత ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
ఒకరికొకరు రాఖీలు కట్టి సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, పరస్పర రక్షణ భావాన్ని చాటి చెబుతున్న చిన్నారులు..

—————–++++++++++———————

&పత్రికా ప్రకటనలు&

——————+++++++++++—————

&&వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!