Social 1080×1350 • Multi-page
08-08-2025 BREAKING NEWS 07:53 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ… – ప్రత్యేక పూజ కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ… – ప్రత్యేక పూజ కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
IMG-20250808-WA0132

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో గల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, సుదర్శణ నారసింహ ఉత్సవ మూర్తి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా నూతన ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు నిఖిలాచార్యులు, నందకిశోరాచార్యులు, శ్రీహర్షచార్యులు, సుదర్శనాచార్యులు, రామాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విగ్రహాలను గూడూరు ప్రభాకర్ రెడ్డి సుమావాణి, ఊరడి సుధాకర్ రెడ్డి-సుగుణ, పీవీ నరేష్, సారయ్య- సుజాత, చందా నగేష్- జ్యోతి, రాజు, సురేందర్, గణపతిరెడ్డి బహూకరించారు. కాగా శుక్రవారం ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల తో పాటు, నేత్రోన్మలనం, కుంభప్రోక్షణ, ద్రిష్టి కుంభ, శాంతి కళ్యాణం, ఋత్విక్ గరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మోహన్ రెడ్డి దంపతులతో పాటు, ఉపాసి సురేందర్ దంపతులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి నూతన ఉత్సవ విగ్రహలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న పూజారులు, పాల్గొన్న దాతలు, భక్తులు.

—————+++++++++———————-

##పత్రికా ప్రకటనలు&&

—————-+++++++———————-

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!