Social 1080×1350 • Multi-page
09-08-2025 BREAKING NEWS 08:19 PM
swarnodayam.com
Telugu Daily News

వీర తిలకం దిద్దిన అక్క చెల్లెల్లు…అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్

వీర తిలకం దిద్దిన అక్క చెల్లెల్లు…అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్
IMG_20250809_202152

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, విశ్వాసం, ఐక్యతను పెంపొందిస్తుంది. ప్రతి సోదరుడు సోదరీమణుల రక్షణ బాధ్యతను హృదయపూర్వకంగా స్వీకరించి, సమాజంలో సౌభ్రాతృత్వాన్ని కాపాడాలి అని పేర్కొన్నారు. ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

హారతి పట్టి, రాఖీ కట్టిన సోదరి అశ్విని, నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!