Social 1080×1350 • Multi-page
10-08-2025 BREAKING NEWS 07:11 PM
swarnodayam.com
Telugu Daily News

మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మండల సుదర్శన్ హుజురాబాద్ చేనేత సహకార సంఘంలో నేత కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా హుజురాబాద్ చేనేత సహకార సంఘం పర్సనల్ ఇంచార్జ్ ఎలిగేటి ఉపేందర్, మేనేజర్ నక్క వైకుంఠం, అసిస్టెంట్ మేనేజర్ మంచికట్ల కోటిలింగం అంత్యక్రియల నిమిత్తం మృతుని భార్య మండల లలితకు రూ. 8,000 ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. మండల సుదర్శన్ చాలా ఏళ్లుగా చేనేత సంఘంలో నేత కార్మికుడిగా పని చేసి వెలకట్టలేనన్ని సేవలందించారని గుర్తు చేశారు. మరణించిన నేత కార్మికుని కుటుంబ సంక్షేమానికై ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న బీమా పథకం నుండి ఆర్థిక సహాయం అందించడానికి చేనేత సంఘం తరఫున తమవంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మృతుడి కుమార్తెలు, అల్లుళ్లు, బంధువులు పాల్గొన్నారు.

మృతుడు మండల సుదర్శన్ భార్య లలితకు ఆర్థిక సహాయం అందజేస్తున్న చేనేత సహకార సంఘం పర్సన్ ఇంచార్జ్ ఉపేందర్, మేనేజర్ వైకుంఠం, సహాయ మేనేజర్ కోటిలింగం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!