Social 1080×1350 • Multi-page
11-08-2025 BREAKING NEWS 06:58 PM
swarnodayam.com
Telugu Daily News

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలి.. – హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలి.. – హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు
IMG-20250811-WA0144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నులిపురుగుల వల్ల పిల్లలకేర్పడుతున్న అనారోగ్య సమస్యల నుండి వారిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు అన్నారు. సోమవారం హుజురాబాద్ డివిజన్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవoను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను వేయాలని, నులిపురుగుల వల్ల పిల్లలకు ఎదుగుదల తగ్గి, రక్తహీనత లాంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వీటి పట్ల అవగాహన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కల్పిస్తారని చెప్పారు. మాత్రలు వేసుకోవడం వల్ల వ్యాధులను తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణ, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మధుకర్, డాక్టర్ జరీనా, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, బాలికల పాఠశాల హెచ్ఎం తిరుమల, ఆరోగ్య విద్యా బోధకులు పంజాల ప్రతాప్, హెల్త్ అసిస్టెంట్ సత్యం, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ, పలువురు ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్న వైద్యురాలు జరినా, కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయరావు

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైద్యురాలు జరీనా…

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి వారి ఉద్దేశించి మాట్లాడుతున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు….

చిన్నారులకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగిస్తున్న డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!