Social 1080×1350 • Multi-page
12-08-2025 BREAKING NEWS 06:10 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించిన ఎస్సార్ రంగనాథన్ జయంతోత్సవం

గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించిన ఎస్సార్ రంగనాథన్ జయంతోత్సవం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్సార్ రంగనాథం 134వ జయంతోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ పరిపాలన అధికారి కె కనకలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా విచ్చేసిన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్ మాట్లాడుతూ భారతదేశంలో తమిళనాడులో జన్మించిన ఎస్ఆర్ రంగనాధన్ ప్రపంచ ప్రసిద్ధి పొందటమే కాకుండా భారత దేశ గ్రంథాలయాల పితామహుడుగా పేరుగాంచి గ్రంథాలయాల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడి పద్మశ్రీ అవార్డు అందుకున్న వారి సేవలను కొనియాడారు. గ్రంథాలయాలు మానవుని ఉన్నతికి పట్టుకొమ్మలుగా నిలుస్తూ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతూ సమాజంలో ఉన్నతమైన పౌరులుగా ఎదగటానికి ఉపయోగపడటమే కాకుండా గ్రంథ పఠనం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు నిధిగా తోడ్పడుతుందని అన్నారు. అదేవిధంగా తన సేవలకు గుర్తుగా ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు పొందిన స్థానిక గ్రంథాలయ అధికారి కె కనకలక్ష్మికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రంధాలయ పాఠకులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రత్నం, సందెల వెంకన్న, ఉపాధ్యాయులు కొంపెల్లి సంజీవ్, రిటైర్డ్ టీచర్ తిరుణహరి రమేష్, మహ్మద్ కాలీక్ హుస్సేన్, సీఆర్పీ తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, సీనియర్ పాత్రికేయుడు కిరణ్ కుమార్, పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.

రంగనాథం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్న అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!