Social 1080×1350 • Multi-page
12-08-2025 BREAKING NEWS 10:03 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం
IMG-20250812-WA0077

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 12: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు మంగళవారం సందర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో అసాంక్రమిక వ్యాధు (ఎన్‌సీడీ) లకు అందుతున్న వైద్యసేవలు, వాటి మెరుగుదలపై ఆస్పత్రి సిబ్బందితో చర్చించి, సేవల మెరుగుదలపై పలు సూచనలు చేశారు. అగ్నిమాపక యంత్రాల పనితీరును పరిశీలించారు. జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించి, విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సిబ్బందికి రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డితో పాటు స్టేట్ లైసెనల్ ఆఫీసర్ రాము, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_16908288
ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించి, విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సిబ్బందికి రోగులకు వివరిస్తున్న జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డితో చర్చిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!