Social 1080×1350 • Multi-page
14-08-2025 BREAKING NEWS 07:46 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ఆకట్టుకున్న ముందస్తు శ్రీ కృష్ణాష్టమి సంబరాలు.

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ఆకట్టుకున్న ముందస్తు శ్రీ కృష్ణాష్టమి సంబరాలు.
IMG-20250814-WA0103

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ అధినేత అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో కళకళలాడుతూ వేడుకలకు ఆకర్షణగా నిలిచారనీ, శ్రీకృష్ణుని బాల్య లీలలు, ధర్మం, నీతి, భక్తి విలువలను విద్యార్థులకు వివరించారు. అలాగే కృష్ణాష్టమి రోజున శ్రీ విష్ణువు ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించాడని హిందువులు నమ్ముతారనీ, ఈ పండుగ ఆయన జన్మదిన పురస్కరించుకొని జరుపుకుంటారనీ అన్నారు. కృష్ణాష్టమిని భక్తి, ఆనందం, సాంస్కృతిక పండుగలను పంచుకునే పండుగ అనీ, ఇది భక్తులకు దేవునితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, స్నేహం, ప్రేమను పంచుకోవడానికి ఇది ఒక అవకాశమనీ చెప్పారు. ఇటువంటి పండుగ ముందస్తుగా ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తాడు లాగుతున్న గోపికలు…

ఉట్టి కొడుతున్న చిన్నారి కృష్ణులు…

అలరించిన చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!