Social 1080×1350 • Multi-page
15-08-2025 BREAKING NEWS 01:55 PM
swarnodayam.com
Telugu Daily News

ఎందరో యోధుల త్యాగాల పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం.. – అమరులకు నివాళులు అర్పించిన పోలాడి రామారావు.

ఎందరో యోధుల త్యాగాల పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం.. – అమరులకు నివాళులు అర్పించిన పోలాడి రామారావు.
IMG_20250815_134843

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఎందరో యోధుల త్యాగాల పోరాటాల ఫలితంగా బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి లభించి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని దేశ భక్తిని ప్రతి ఒక్కరం చాటాలని
సీనియర్ సిటిజన్ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామారావు పాల్గొని మహాత్ముని, వల్లభాయి పటేల్, భగత్ సింగ్, అంబేద్కర్ చిత్ర పటాలకు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు మానకొండూర్ మండలంలోని తన స్వగ్రామమైన వన్నారం గ్రామ ప్రథాన కూడలిలో గ్రామస్థులతో కలిసి పోలాడి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారి వెంకన్న ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద, గ్రామ ప్రాథమిక ప్రాథమిక పాఠశాల, అంబేద్కర్ సంఘ కార్యాలయం, యాదవ సంఘ కార్యాలయాల వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోను వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఉత్సాహ భరితంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పోలాడి రామారావు పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజలకు, నాయకులకు,ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్ప పండుగని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. కులం మతం ప్రాంతం కంటే దేశం గొప్పదని భారత్ బలమైన దేశంగా అవతరించేందుకు ప్రతి ఒక్కరం జాతీయ స్ఫూర్తితో పని చేయాలని కోరారు. సంస్కృతి సంప్రదాయాలకు మన రాజ్యాంగమే నిదర్శనమని అన్నారు. హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై మనమందరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ స్పూర్తిని చాటాలని పొలాడి రామారావు పిలుపునిచ్చారు.

జాతీయ జెండాను ఎత్తుతున్న పోలాడి రామారావు..

పలుచోట్ల జాతీయ జెండాలకు సెల్యూట్ చేస్తున్న పోలాడి రామారావు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!