Social 1080×1350 • Multi-page
15-08-2025 BREAKING NEWS 10:58 PM
swarnodayam.com
Telugu Daily News

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
IMG-20250815-WA0209

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కులను శుక్రవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో కల తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం
కల్యాణ లక్ష్మీ చెక్కులతో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణలక్ష్మి పేరిట లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వము వచ్చిన తర్వాత వేల పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. 13,01508 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులు,63 మంది లబ్ధిదారులకు 15,91,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!