Social 1080×1350 • Multi-page
15-08-2025 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….గ్రామ గ్రామాన ఎగిరిన మువ్వన్నెల జెండా

హుజురాబాద్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….గ్రామ గ్రామాన ఎగిరిన మువ్వన్నెల జెండా
IMG-20250815-WA0335

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం డివిజన్ లో ప్రజలు, అధికారులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో స్వాతంత్ర వేడుకలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రంగురంగుల జెండాలతో కార్యాలయాలను అలంకరింపజేశారు. పాఠశాలల విద్యార్థులు పట్టణంలోని పురవీధుల గుండా జాతీయ జెండాను పట్టుకొని స్వాతంత్ర పోరాట యోధుల వేషధారులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారీ వారి కార్యాలయంలో జాతీయ పతాకాలను ఎగరవేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ రమేష్ బాబు, ఏసీపి కార్యాలయంలో ఏసీపి వాసంశెట్టి మాధవి, కోర్టు కార్యాలయ ఆవరణలో న్యాయమూర్తి కిరణ్ కుమార్, సర్కిల్ కార్యాలయంలో టౌన్ సిఐ కరుణాకర్, రూరల్ సి ఐ వెంకన్న గౌడ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎంవిఐ కంచి వేణు, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కనకయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కేoసారపు సమ్మయ్య, ఎమ్మార్సీలో ఎంఈఓ శ్రీనివాస్, సింగిల్ విండోలో చైర్మన్ కొండలరెడ్డి, సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ సుగుణ, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి అశోక్, కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఆఫీసర్ చందన, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు, బిఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు టి రాజు, వాకర్స్ అధ్యక్షులు కే హరిప్రసాద్, వర్తక సంఘంలో అధ్యక్షులు హరిశంకర్, ఆయా పాఠశాలల్లో పాఠశాల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వివిధ చోట్ల జెండాలను ఆవిష్కరించి జెండాకు వందనం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!