16-08-2025 NORMAL NEWS 12:02 PM
swarnodayam.com
Telugu Daily News
16-08-2025 12:02 PM By Mandala Yadagiri

ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన యువకుడి మృతి.. అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలు హరి!

ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన యువకుడి మృతి.. అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలు హరి!
IMG_20250816_115006

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన పంజాల కృష్ణ(42) అనే యువకుడు గత ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం ప్రకారం… కృష్ణ హుజురాబాద్ కు చెందిన వనం హరీష్ అనే వ్యక్తికి 25 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడని, గత 15 నెలలుగా అసలు వడ్డీ ఇవ్వడం లేదని, ఇటీవల డబ్బుల కోసం అడగగా నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకొ అని హరీష్ అనడంతో తను ఇవ్వాల్సిన వారికి సమాధానం చెప్పుకోలేక మనస్థాపానికి గురై హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో గత ఆదివారం రాత్రి సెల్ఫీ వీడియో తీసి తన చావుకు హరీష్ కారణమని అతని దగ్గర డబ్బులు వసూలు చేయాలని తన కుటుంబ సభ్యులకు తెలుపుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణను వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని జమ్మికుంట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడన్నారు. కాగా కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయాగా పోలీసులు సంఘటన పూర్వపరాలను విచారిస్తున్నారు. అయితే అప్పు ఇచ్చిన పాపానికి ఓ యువకుడు రెండు ప్రాణం బలి కావడం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హుజురాబాద్ ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా హార్ట్ టాపిక్గా మారింది. అతని మరణానికి కారణమైన వ్యక్తులపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న కృష్ణ..

మృతి చెందిన పంజాల కృష్ణ (ఫైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!