17-08-2025 NORMAL NEWS 09:13 PM
swarnodayam.com
Telugu Daily News
17-08-2025 09:13 PM By Mandala Yadagiri

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా రవీందర్

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా రవీందర్
IMG-20250817-WA0038

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా మార్త రవీందర్ ఎంపికయ్యారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షులు ఆర్ చారి మాట్లాడుతూ..ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ విషయంపై
ఈ నెల 25 లోగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ లో ఒక రిటైర్మెంట్ భవనం కోసం ప్రయత్నం చేయాలన్నారు. సిసిఎస్ గాని పీఎఫ్ గానీ సభ్యులు చనిపోయిన వారి భార్యలకు నూతన పెన్షన్ ఇప్పించుటకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పేరాల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఈవిఆర్ నరసయ్య, కోశాధికారి ఏ బాపురెడ్డి, నాయకులు బొంగోని రాజమౌళి, ఎం రాజమౌళి, రావుల రఘుపతి, బి గంగరాజులు, మండ కనకయ్య, రంగు పండరి, గోలి ఉపేందర్, వైకే స్వామి, కెపి రెడ్డి, బి మొగిలి, ,పి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మార్త రవీందర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!