Social 1080×1350 • Multi-page
18-08-2025 BREAKING NEWS 12:01 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ లోకి ప్రముఖ న్యాయవాది బండి కళాధర్..!..ప్రణవ్ ను కలిసిన అడ్వకేట్ బండి కళాధర్..!! – నేడో..రేపో చేరికలపై క్లారిటీ…

కాంగ్రెస్ లోకి ప్రముఖ న్యాయవాది బండి కళాధర్..!..ప్రణవ్ ను కలిసిన అడ్వకేట్ బండి కళాధర్..!! – నేడో..రేపో చేరికలపై క్లారిటీ…
Oplus_16908288

– హుజురాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహం రచిస్తున్న ప్రణవ్…

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. పార్టీ బాధ్యులు వోడితల ప్రణవ్ బాబు పక్కా ప్రణాళిక, దూర దృష్టితో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులైన వారిని సరైన సమయంలో పార్టీకి ఆహ్వానించి బలం కూడగడుతున్నారు.

ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన సీనియర్ ప్రముఖ న్యాయవాది బండి కళాధర్ ను పార్టీలోకి చేర్చుకునేందుకు పక్కా వ్యూహం రచించారు. దళిత నాయకుడిగా, దళిత రత్న అవార్డు గ్రహీతగా, పలుమార్లు హుజురాబాద్ లాయర్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికై న్యాయ పక్షాన పోరాటం సాగిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడి ఎంతోమంది ఉద్యమకారులను చేరసాల నుండి విడిపించి ఉద్యమ భావుట ఎగరవేసిన వ్యక్తిగా బండి కళాధర్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇన్ని రోజులు బండి కళాధర్ రాజకీయాల వైపు క్రియాశీలంగా రావాలని కోరిన సరైన సందర్భం దొరకలేదు. ఇప్పుడు పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు బండి కళాధర్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని బండి కళాధర్ లాంటి న్యాయవాదులను మేధావులను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకొని పార్టీ పటిష్టతకు మరింత బలం చేకూరేలా కార్యకర్తలను సమీకరించడంలో ప్రణవ్ బాబు మరింత ముందుకు సాగుతున్నారని తెలుపవచ్చు. బండి కళాధర్ చేరికతో దళిత సామాజిక వర్గం మేధావి వర్గం ఆయన వెంట కలిసి వస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు గెలుపు దిశగా పయనిస్తుంది. బండి కళాధర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే కమలాపూర్ కాంగ్రెస్ లో మరింత బలం చేకూరి స్థానిక సంస్థలు గెలుపు దిశగా అడుగులు వేస్తోందని పలువురు విశ్వసిస్తున్నారు.

సీనియర్ ప్రముఖ న్యాయవాది బండి కళాధర్

–బండి కళాధర్ ను కలిసిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు…

——————–++++++++————————

&&పత్రికా ప్రకటనలు&&

———————++++++++———————-

##వార్షికోత్సవ శుభాకాంక్షలు ##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!