Social 1080×1350 • Multi-page
18-08-2025 BREAKING NEWS 04:39 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు.

రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు.
IMG-20250818-WA0087

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375 వ జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్ లో గల సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే ఎస్సీ, బీసీ, బహుజన కులాలను అణచివేస్తున్న సందర్భంలో భూస్వాములు, పెత్తందారులపై సర్దార్ సర్వాయి పాపన్న తిరుగుబాటు చేసి బహుజన కులస్తులందరినీ ఏకం చేసి హైదరాబాద్ గోల్కొండ ఖిల్లాపై మొగల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి వారిని ఓడించి గోల్కొండ సామ్రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు పాలించారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు ఆ గుట్టను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు గౌడ్ పంజాల తిరుపతి గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, చిట్టంపల్లి నాగరాజు గౌడ్, సొల్లు మహేందర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మార్త రవీందర్, తాండవరం విష్ణుమూర్తి, రజక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బీసీ సంఘం రాష్ట్ర నాయకులు..

——————–+++++++++——————

&&పత్రికా ప్రకటనలు&&

—————-+++++++————————–

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!