19-08-2025 NORMAL NEWS 05:16 PM
swarnodayam.com
Telugu Daily News
19-08-2025 05:16 PM By Mandala Yadagiri

పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని PHC ఎదుట ఆశ వర్కర్స్ ధర్నా

పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని PHC ఎదుట ఆశ వర్కర్స్ ధర్నా
IMG-20250819-WA0108

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆశా కార్యకర్తలకు జూలై నెల పారితోషకాలు వెంటనే చెల్లించాలని, ఆగస్టు నెల పారితోష్కాలు ఆలస్యం చేయకుండా గతంలో 1వ తేదీన చెల్లించినట్లు సకాలంలో చెల్లించాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18,000/_లు ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ హుజురాబాద్ మండలం చేల్ పూర్ పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు జూలై నెల పారితోషకాలు రాలేదన్నారు. పారితోషకాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఆశ వర్కర్ల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల (30తేదీ) లోపు చెల్లించాలని, ఆగస్టు నెల పారితోషకాలు సకాలంలో చెల్లించాలని అన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలకు రూ.18,000 లు నిర్ణయించి ఇవ్వాలని, పిఎఫ్, ఈయస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, 2021 జులై నుండి డిసెంబర్ వరకు 6నెలల పిఅర్ సి ఏరియల్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఏఎన్ఎం, జీ ఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ఏ ఎన్ఏం, జీఎన్ ఎం పోస్టులలో డైరెక్ట్ ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని లేదా వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలన్నారు. గత 15 రోజుల సమ్మె హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలు, వెంటనే నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఏ జిల్లాలో లేని విధంగా ఆరోగ్య మహిళ ఈ కార్యక్రమాన్ని పెట్టి ఆశా కార్యకర్తలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. శుక్రవారం సభలు పెట్టి కరీంనగర్ జిల్లాలో అదనంగా ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారనీ ఆమె పేర్కొన్నారు.

అదనపు పనికి అదనపు పారితోషకాలు ఇవ్వడం లేదనీ, ఆశాల పైన పని భారం మోపి ఆశాలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారన్నారు. Anc టార్గెట్ పెట్టి ఆశాలకు చుక్కలు చూపిస్తా ఉన్నారనీ కాబట్టి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈనెల 25 న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకి పిలుపునిచ్చామని, అట్లాగే కమిషనర్ ముట్టడి కూడా చేస్తామని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే సమ్మెలోకి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తాడూరి లత, మండల కార్యదర్శి కాళేశ్వరపు పుష్పలత, జంగ రమాదేవి, ఏడుముల సుజాత, జంగ అరుణ తదితర ఆశలు, నాయకులు పాల్గొన్నారు.

Oplus_16908288

ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత..

చెల్పూర్ పీహెచ్సీ వైద్యురాలుకు ప్రతిపత్రం అందజేస్తున్న ఆశాల సంగం నాయకులు, కార్యకర్తలు…

—————–++++++++++——————–

&&పత్రికా ప్రకటనలు&&

————–++++++++——————–

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!