Social 1080×1350 • Multi-page
19-08-2025 BREAKING NEWS 06:06 PM
swarnodayam.com
Telugu Daily News

అన్నదాతల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం… – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

అన్నదాతల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం… – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20250819-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎరువుల కోసం రోడ్డెక్కి అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. మంగళ వారం కరీంనగర్ లో రైతు ప్రజా సంఘాల నాయకుల తో కలిసి నిర్వహించిన సమావేశంలో రామారావు మాట్లాడారు.
వానా కాలం పంటలకు యూరియా వేయాల్సిన కీలక తరుణం లో వ్యవసాయ సహకార సంఘాలకు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వస్తున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదని డబ్బులు ఇచ్చి కొనుక్కొనే యూరియా కు కూడా ఇంత కొరత ఉంటే పంటల సాగు ఎలా సాధ్యమని రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఖరీఫ్ సీజన్లో దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం ఇవ్వగా ఇచ్చిన యూరియా నిల్వలను సైతం రైతులకు పంపిణీ చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడం తో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తా రోకోలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇచ్చే ఒకటి రెండు బస్తాల యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి సోమ్మ సిల్లి హాహాకారాల తో ఆర్థ నాదాలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతుందని ఈ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి తక్షణమే సరి దిద్దక పోతే అన్నదాతల తిరుగుబాటు తప్పదని, 4 రోజుల్లో పరిష్కారం చూపక పోతే రైతులతో కలిసి ప్రభుత్వాలను స్తంభింప జేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు.

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

—————-++++++++——————-

@@పత్రికా ప్రకటనలు&&

————–+++++++++——————

##వార్షికోత్సవ శుభాకాంక్షలు&&

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!