Social 1080×1350 • Multi-page
19-08-2025 BREAKING NEWS 06:34 PM
swarnodayam.com
Telugu Daily News

మామిళ్ల వాడ ఉర్దూ మీడియం పాఠశాలలో నిలుస్తున్న వర్షం నీటిని అరికట్టండి… – ఎండి ఖాళిద్ హుస్సేన్ వినతి.

మామిళ్ల వాడ ఉర్దూ మీడియం పాఠశాలలో నిలుస్తున్న వర్షం నీటిని అరికట్టండి… – ఎండి ఖాళిద్ హుస్సేన్ వినతి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మామిళ్ళవాడలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల కాంపౌండ్ లోపల వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల పరిసర ప్రాంతాల పిల్లలు అనారోగ్యంకు గురవుతున్నారనీ, అదేవిధంగా స్కూల్ ముందు డ్రైనేజ్ సమస్య నెలకొందని తక్షణమే దానిని పరిష్కరించాలని కోరుతూ హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు ప్రజా సంఘాల నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్, మాజీ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడు ఎండి ఖాళిద్ హుస్సేన్ వినతి పత్రం అందజేశారు. 17వ వార్డ్ లోనీ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణంలో నిత్యం నీరు నిల్వ ఉండడం వలన పిల్లలు ఆ నీటిలో ఆడుకొని, దోమలు కుట్టి అనారోగ్యంకు గురవుతున్నారన్నారు. కావున పాఠశాల కాంపౌండ్ లోపల అవసరమైనంత మొరం పోయించాలని, అదేవిధంగా స్కూల్ ముందు డ్రైనేజ్ సమస్య పరిష్కరించేందుకు శాశ్వత డ్రైనేజీని నిర్మించి ఆ సమస్య పరిష్కరించి స్కూల్ పిల్లల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందివ్వాలని ఖలీద్ హుస్సేన్ కమిషనర్ను కోరడం జరిగింది. దీంతో కమిషనర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ప్రజా సంఘాల నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్, మాజీ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాళిద్ హుస్సేన్, 17వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అజ్జు తదితరులు తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు వినతి పత్రం అందజేస్తున్న ప్రజా సంఘాల నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్, మాజీ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడు ఎండి ఖాళిద్ హుస్సేన్, 17వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అజ్జు

—————–++++++++++++——————

&&పత్రికా ప్రకటనలు&&

————–++++++++———————-

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!