Social 1080×1350 • Multi-page
20-08-2025 BREAKING NEWS 04:52 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్
IMG-20250820-WA0030

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పరిశీలన నిమిత్తం వచ్చి, కళాశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనర్ రిపేర్ వర్క్ లకు చెందిన పనులను పరిశీలించడం జరిగింది.కళాశాల విద్యార్థులకు సమావేశ మందిరము మరియు ఇతరత్రా పనులు గ్రిల్స్, మెట్లు, ఫ్యాన్లు, కరెంటు నకు సంబంధించినవి వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు వివరించడం జరిగింది. విద్యార్థులకు మీటింగ్ హాల్ లేనందున ఆడిటోరియం ఆవశ్యకత వివరించారు. అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఐడి కార్డ్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి పాఠాలు నేర్చుకొని ఉత్తీర్ణాత శాతం పెంచాలని సూచించారు. కళాశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలను, చెత్తా చెదారము లను తొలగించి సుమారు 250 మొక్కలు నాటడం జరిగింది. 
అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ని శాలువాతో కళాశాల ప్రిన్సిపాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు, లెక్చరర్లు కే సుగుణ, ప్రసాద్, జీ తులసీదాస్, కెవి వాసుదేవరావు, కే మురళీమోహన్, జే విజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సుహాసిని, లైబ్రేరియన్ రాజేశం, వెంకటరమణ, రాజేందర్, రహీముద్దీన్ పాల్గొన్నారు.
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

కళాశాలలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న అదనపు కలెక్టర్..

కమిషనర్ సమ్మయ్యను వివరాలు అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్..

కళాశాల ఆవరణంలో మొక్కలు నాటుతున్న అదనపు కలెక్టర్, అధికారులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!