20-08-2025 NORMAL NEWS 07:39 PM
swarnodayam.com
Telugu Daily News
20-08-2025 07:39 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో బిజెపి పార్టీకి భారీ షాక్! – ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరులు శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి అద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

హుజురాబాద్ లో బిజెపి పార్టీకి భారీ షాక్! – ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరులు శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి అద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక.
IMG-20250820-WA0081

🔴కెసిఆర్, కౌశిక్ రెడ్డి నాయకత్వంలో BJP ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ లోకి…

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ రాజకీయాల్లో మరో మలుపు నమోదైంది.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న ప్రేమ, బిఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్షా కెసిఆర్ అని, ఆయనే మళ్ళి తెలంగాణకు ముఖ్యమంత్రి కావలి అని పలువురు ముఖ్యనేతలు బిజెపి పార్టీకి రాజీనామా చేసి బుధవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు:
•అనుమళ్ల శామ్‌సుందర్ రెడ్డి (సింగిల్ విండో చైర్మన్ జూపాక),
•కట్కూరి మల్లారెడ్డి(వార్త మల్లారెడ్డి), కట్కూరి కోమల్ రెడ్డి ఉప సర్పంచ్(రాజపల్లి), అనుమళ్ల రాజిరెడ్డి (సీనియర్ నాయకులు) చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భాజపా పార్టీ ప్రజల కోసం ఏం చేయలేకపోయిందనీ, హుజురాబాద్ అభివృద్ధి కేవలం కౌశిక్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యం అన్నారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న నాయకత్వం మాకు ఎంతో నమ్మకం కలిగించిందనీ, అందుకే మేమంతా ఏకగ్రీవంగా బిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం అన్నారు. రేపు జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలో హుజురాబాద్ లో గెలిపించుకుంటామని, బిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తాం అని వారు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ
హుజురాబాద్ ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. Brs పార్టీ లో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కలిసి స్థానిక సంస్థలో హుజురాబాద్ లో BRS జండా ఎగరవేస్తాం అని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ శక్తి మరింతగా పెరిగి, ప్రజా ఆశయాలు నెరవేరే దిశలో ముందుకు సాగుతుంది” అని అన్నారు.
మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె శ్రీనివాస్ మాజీ sc కార్పొరేషన్ చైర్మన్ బాండ శ్రీనివాస్ సీనియర్ నాయకులూ శాంతన్ రెడ్డి పాల్గొన్నారు.

అనుమళ్ల శామ్‌సుందర్ రెడ్డి (సింగిల్ విండో చైర్మన్ జూపాక)కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

కట్కూరి మల్లారెడ్డి(వార్త మల్లారెడ్డి)కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
అనుమళ్ల రాజిరెడ్డి (సీనియర్ నాయకులు)కి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్లో గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే..
కట్కూరి కోమల్ రెడ్డి ఉప సర్పంచ్(రాజపల్లి)కి బిఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి నేతలతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధిక శ్రీనివాస్ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!