20-08-2025 NORMAL NEWS 09:42 PM
swarnodayam.com
Telugu Daily News
20-08-2025 09:42 PM By Mandala Yadagiri

బిసి ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు

బిసి ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,ఆగస్టు 20: బిసి ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా బిసి ఆజాద్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ, బీసీ ఆజాద్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మార్త రవీందర్, బిసి ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, తాళ్ల రమేష్, బిసి ఆజాద్ ఫెడరేషన్ హుజురాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు కందుకూరి ఉమాశంకర్, వేముల శ్రీకాంత్, యాట కొండల్ రెడ్డి, చిదురాల శ్రావణ్, జూపాక శివమణి తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసి శ్రీనివాస్ కు తినిపిస్తున్న బిసి ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!