Social 1080×1350 • Multi-page
20-08-2025 BREAKING NEWS 11:17 PM
swarnodayam.com
Telugu Daily News

కబడ్డి ఛాంపియన్షిప్ ట్రోఫీకి భూపతిరాజ్ ఎంపిక..

కబడ్డి ఛాంపియన్షిప్ ట్రోఫీకి భూపతిరాజ్ ఎంపిక..
IMG-20250820-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీకి హుజురాబాద్ కు చెందిన తూర్పాటి భూపతిరాజ్ భద్రాద్రి బ్రేవ్స్ జట్టుకు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డి అసోసియేషన్ ఉపాధ్యక్షులు ch సంపత్ రావు , జిల్లా సెక్రెటరీ బుర్ర మల్లేష్ , ఉపాధ్యక్షులు కాల్వ సునీల్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రోఫీకి ఎంపికైన భూపతి రాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గండ్ర సమ్మిరెడ్డి , రవీందర్ దామోదర్ , నీరటి రమేష్ , కేక్కర్ల సారయ్య మహేష్ ,సతీష్ వర్మ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ ట్రోఫీకి క్రీడాకారుడు భూపతిరాజ్ ఎంపిక పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తూర్పాటి భూపతిరాజ్ భద్రాద్రి బ్రేవ్స్ జట్టుకు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డి అసోసియేషన్ ఉపాధ్యక్షులు CH సంపత్ రావు తెలియజేశారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనందుకుగాను హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు భూపతిరాజ్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బుర్ర మల్లేష్, కాల్వ సునీల్ రెడ్డి, తాళ్ళపెల్లి శ్రీనివాస్ ఉన్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు భూపతిరాజ్ ను అభినందిస్తూ….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!