Social 1080×1350 • Multi-page
20-08-2025 BREAKING NEWS 11:32 PM
swarnodayam.com
Telugu Daily News

ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి: – తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు

ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి: – తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు
IMG-20250820-WA0102


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కోర్టు కేసులు పరిష్కరించి వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతి షెడ్యూల్ను విడుదల చేయాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు అన్నారు. బుధవారం హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్, బోర్నపల్లి, సింగాపూర్, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట, రాంపూర్ తదితర గ్రామాలలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ కాఫ్ర్డులు జారీ చేయాలన్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించిన కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ కేసులను యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని, ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన 10,000 పిఎస్ హెచ్ఎం పోస్టులను డీఈడీ, బీఈడీ ఎస్జీటీలచే భర్తీ చేయాలని పపెండింగ్లో ఉన్న5 డిఏ లను విడుదల చేయాలని, పిఆర్సి రిపోర్టును తెప్పించుకొని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధు కింద జీతాలు ప్రతి నెల మొదటి తారీకున చెల్లించాలని, కేజీబీవీ లలో పనిచేస్తున్న సిబ్బందికి సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా వారికి మినిమం టైమ్ స్కేల్ వేతనాలు చెెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి రాచకొండ పవన్ కుమార్, లక్కాకుల రాంప్రసాద్,చెల్లోజు అరుణ్ కుమార్, పైడాకుల సదయ్య, తోడేంగ సంపత్ కుమార్, బి తిరుమల, జి సమ్మిరెడ్డి, వి శ్రీనివాస్ పృథ్వీరాజ్ సింగ్, వెంకటేష్, ఎస్ రాజేందర్, ఎం శ్రీదేవి, యు సంపత్ రాజ్, మారుతి ప్రసాద్, దయాకర్, కే వెంకటేశ్వర్లు, ప్రశాంత్, వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!