21-08-2025 NORMAL NEWS 03:57 PM
swarnodayam.com
Telugu Daily News
21-08-2025 03:57 PM By Mandala Yadagiri

కవ్వంపల్లి కుటుంబానికి కాంగ్రెస్ నేత ప్రణవ్ పరామర్శ

కవ్వంపల్లి కుటుంబానికి కాంగ్రెస్ నేత ప్రణవ్ పరామర్శ
IMG_20250821_155415

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, మానకొండూరు శాసనసభ్యుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజేశం చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళులు అర్పించి, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, నరేష్, కిరణ్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కవ్వంపల్లి సత్యనారాయణను రాజేశం మృతి పట్ల వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రణవ్..
రాజేశం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ప్రణవ్, కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!