21-08-2025 NORMAL NEWS 09:11 PM
swarnodayam.com
Telugu Daily News
21-08-2025 09:11 PM By Mandala Yadagiri

మహిళల ఆర్థిక ఎదుగుదలతో సామాజిక పురోగతి

మహిళల ఆర్థిక ఎదుగుదలతో సామాజిక పురోగతి
IMG-20250821-WA0202

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సమాజంలో మహిళలు సగానికి పైగా ఉన్నారని వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజ పురోగతి సాధ్యమవుతుందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుమాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యలు అన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మెప్మా సర్వసభ్య సమావేశం ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హుజురాబాద్ మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 27 సమాఖ్యలు పొదుపు ద్వారా లాభాల్లో ఉన్నారని అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని వారు సూచించారు.
మహిళలు ఫుడ్ ప్యాకేజీ బ్రాండింగ్ చెయ్యాలి అని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్నీ విషయాల్లో ముందుకు సాగుతున్నారని మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని అన్నారు. మహిళలు ఫుడ్ బ్రాండెడ్ గా తయారు చేయడం పట్ల వారిని అభినందించారు. ఈ మహాసభలో మెప్మా డీఎంసీ శ్రీవాణి, మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టిపిఓ అశ్వినిగాంధీ, టిఎంసి మల్లేశ్వరి, స్త్రీనిధి మేనేజర్ అనిల్, సిఎల్ ఆర్పిలు రమాదేవి, స్వరూప, పట్టణ సమాఖ్య ఓబిఎస్ అధ్యక్షురాలు స్రవంతి, కార్యదర్శి కళ్యాణి, కోశాధికారి నాజీయా, పలువురు ఆర్పీలు ఎస్హెచ్ జి సభ్యులు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫుడ్ ఫెస్టివల్ ను పరిశీలిస్తున్న మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుమాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!