21-08-2025 NORMAL NEWS 09:36 PM
swarnodayam.com
Telugu Daily News
21-08-2025 09:36 PM By Mandala Yadagiri

ఎస్సారెస్పీ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలి. – వృధాగా పోతున్న నీటిని మిడ్ మానేరు నింపాలి. – హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి.

ఎస్సారెస్పీ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలి. – వృధాగా పోతున్న నీటిని మిడ్ మానేరు నింపాలి. – హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి.
IMG-20250821-WA0210

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సారెస్పీ నిండి వృధాగా పోతున్న సాగునీటిని మిడ్ మానేరు డ్యాంను నింపి రైతులకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందించాలని హుజురాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు, సహకార సంఘాల అధ్యక్షుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తుండగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వర్షం నీరు ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిండగా తలుపులు తెరవడంతో ఉపయోగపడాల్సిన సాగునీరు వృధాగా సముద్ర జలాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వృధాగా పోతున్న జలాలను మిడ్ మానేరు, ఎల్ ఎండి ప్రాజెక్టులను నింపి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు కాలువ మీద ఆధారపడి ఆయకట్టు రైతులు పంటలు సాగు చేస్తుండగా సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిండిన ప్రాజెక్టుల నీరును వృధాగా పోనీయకుండా ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరిపడా యూరియా తెప్పించి రైతులకు అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

హుజురాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు, సహకార సంఘాల అధ్యక్షుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!