Social 1080×1350 • Multi-page
22-08-2025 BREAKING NEWS 10:53 PM
swarnodayam.com
Telugu Daily News

రాయితీపై రైతులకు యంత్రాల సరఫరా!

రాయితీపై రైతులకు యంత్రాల సరఫరా!
IMG-20250822-WA0061

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాయితీపై రైతులకు యంత్రాలను అందజేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి చాడ భూమ్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ… వ్యవసాయ యాంత్రీకరణపై సబ్- మిషన్ (SMAM) పథకం కింద 2025 -26 అతిక సంవత్సరం గాను రైతులకు రైతుపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించుటకు రైతుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని అన్నారు.

ఈ పథకం కింద సన్న, చిన్న కారు, మహిళా రైతులకుst&sc వర్గాల రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని తెలిపారు. హుజురాబాద్ మండలంకు బ్యాటరీ పంపులు 170, ప్లేయర్లు 30, రోటోవేటర్లు 12, డిస్క్, ప్లవ్, కేజ్రీల్స్ 15, పవర్ విడర్ 1, పవర్ టిల్లర్ 2, బ్రష్ కట్టర్ 3, గడ్డి చుట్టే యంత్రము1, కేటాయించారని ఆసక్తిగల రైతులు దరఖాస్తు పత్రంతో పాటు ఒక ఫోటో కొత్త పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్, ఆధార్ జిరాక్స్, డాక్టర్ తో పనిచేయు యంత్రాలకు డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు జత చేసి హుజురాబాద్ వ్యవసాయ కార్యాలయంలో వచ్చేనెల 5వ తేదీ లోపు ఇవ్వాలని కోరారు.

మండల వ్యవసాయ శాఖ అధికారి చాడ భూమ్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!