Social 1080×1350 • Multi-page
23-08-2025 BREAKING NEWS 09:26 PM
swarnodayam.com
Telugu Daily News

బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. – గిన్నిస్ రికార్డ్ ప్రయత్నం

బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. – గిన్నిస్ రికార్డ్ ప్రయత్నం
IMG-20250823-WA0129

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఆగస్టు 23: ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం రెండవ ముఖ్య సంచాలకులు కీర్తిశేషులు రాజయోగిని దాది ప్రకాశ్ మణి 18వ స్మృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మా కుమారిస్ సమాజ సేవ ప్రభాగం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మకుమారిస్ సేవా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు.

బ్రహ్మకుమారిస్ ముఖ్య సంచాలిక బీకే విజయలక్ష్మి, బ్రహ్మకుమారి మనీషా, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దాది ప్రకాష్ మణి స్మృత్యర్థం బ్రహ్మకుమారిస్ దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.ఈ ఈ శిబిరాల ద్వారా అత్యధిక సంఖ్యలో రక్తం యూనిట్లను సేకరించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాది ప్రకాష్ మణి సంస్థ సంస్థాపకులైన ప్రజాపిత బ్రహ్మ బాబా 1969లో దేహయాత్ర చాలించినప్పటి నుండి 2007 ఆగస్టు 25వ తారీకు వరకు సంస్థ రెండవ ముఖ్య సంచాలికగా సంస్థ అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా సంస్థ సేవా కేంద్రాల స్థాపనకు ఎనలేని కృషి చేశారు. వీరి స్మృతి దినము ప్రతి సంవత్సరము విశ్వ బంధుత్వ దినోత్సవంగా బ్రహ్మకుమారిస్ నిర్వహిస్తూ వస్తున్నారు.

25న ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో..

ఈనెల 25న ఎస్ఆర్ఆర్ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బికే విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఏటా ఎంతోమంది రోగులు, ప్రమాదాలకు గురైన వారు సకాలంలో రక్తం అందుబాటులో లేక మరణిస్తున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికి రక్త దాన కార్యక్రమం తోడ్పడుతుందని కరీంనగర్ బ్రహ్మ కుమారి శాఖల సంచాలిక బికే విజయ్ తెలిపారు.

ఈ నెల 25న జరిగే రక్తదాన శిబిరంలో స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తమ సంస్థ తరఫున సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఔత్సాహికులు..

రక్త దానం చేసిన దాతలకు సర్టిఫికెట్ ప్రధానం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!