23-08-2025 NORMAL NEWS 11:22 PM
swarnodayam.com
Telugu Daily News
23-08-2025 11:22 PM By Mandala Yadagiri

పంబాల కమ్యూనిటీకి కుల ప్రమాణపత్రాలు జారీలో సమస్యలు పరిష్కరించాలని వినతి.

పంబాల కమ్యూనిటీకి కుల ప్రమాణపత్రాలు జారీలో సమస్యలు పరిష్కరించాలని వినతి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ పంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్ ప్రతినిధులు ఈరోజు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశ్విని తానాజీ వాకడే ను కలిసి పంబాల కమ్యూనిటీకి కుల ప్రమాణపత్రాలు జారీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆలస్యం కారణంగా విద్యార్థులు విద్యా ప్రవేశాల్లో అవకాశాలు కోల్పోతుండటం, ఉద్యోగులు పదోన్నతుల్లో వెనుకబడుతున్నారని సంఘం నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కొన్ని స్పష్టీకరణలు కోరగా, వాటిని ఆర్డీఓ మహేశ్వర్ సమగ్రంగా వివరించారు. సమస్యలను విన్న అనంతరం, అన్ని తహసీల్దార్లకు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అవసరమైన సూచనలు ఇస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.

అలాగే, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అందుబాటులో లేకపోవడంతో, మరొక వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం ఇన్‌వర్డ్ విభాగంలో సమర్పించి, స్వీకరణ రసీదు తీసుకున్నామన్నారు.

తెలంగాణ పంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్ ప్రతినిధులు, ఈ సూచనలతో కులప్రమాణపత్రాల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అలాగే, సోమవారం ఫాలోఅప్ చేయాలని నిర్ణయించాలన్నారు.

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశ్విని తానాజీ వాకడే కు వినతి పత్రం అందజేస్తున్న తెలంగాణ పంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్ ప్రతినిధులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!