24-08-2025 NORMAL NEWS 09:23 PM
swarnodayam.com
Telugu Daily News
24-08-2025 09:23 PM By Mandala Yadagiri

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. – చితక్కొట్టిన సిబ్బంది

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. – చితక్కొట్టిన సిబ్బంది
IMG-20250824-WA0094

స్వర్ణోదయం ప్రతినిధి,పాట్నా, ఆగస్ట్24: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ యాత్రలో కీలక ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి ముద్దు పెట్టాడు. ఈ ఉహించని పరిణామంతో.. రాహుల్ గాంధీతోపాటు ఆయన భద్రత సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని.. ఆ ముద్దు పెట్టిన వ్యక్తిని గట్టిగా పక్కకు లాగి.. రెండు కొట్టారు. అయితే యువకుడు ముద్దు పెట్టినా.. రాహుల్ గాంధీ మాత్రం తన బైక్‌ను ఆపకుండా ముందుకు సాగిపోయారు.

ఈ ఘటన ఆదివారం పుర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓట్ చోర్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బిహార్‌లో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ క్రమంలో ఈ యాత్రకు విధుల్లో భాగంగా భద్రత కల్పిస్తున్న పోలీసులతోపాటు ప్రజలు సైతం తీవ్రంగా గాయపడుతున్నారు.

ఆగస్టు 16వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో ముగియనుంది. బిహార్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు గల్లంతు కావడమే కాకుండా.. భారీగా నకిలీ ఓట్లు.. ఓటర్ల జాబితాలో వచ్చి చేరాయంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సైతం స్పందించింది. మీరు చేసిన ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని.. లేకుంటే క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం సూచించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!