Social 1080×1350 • Multi-page
25-08-2025 BREAKING NEWS 07:21 PM
swarnodayam.com
Telugu Daily News

ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మట్టితో స్వయంగా గణపతి విగ్రహాలను సోమవారం తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టుకొని పూజించాలని తద్వారా ప్రకృతిని కాపాడవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. పి ఇందిరాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డా. కె మల్లారెడ్డి, డాక్టర్ స్వరూపారాణి, డాక్టర్ సరళ ఝాన్సీరాణి, డాక్టర్ ఓదెలు, పల్లవి, డాక్టర్ సుమలత, డాక్టర్ రేణుక, రమ, డాక్టర్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులు.. గణపతిలతో అధ్యాపకులు, విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!