Telugu Daily News
నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజా ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తుందని పేర్కొన్నారు. సకల విజ్ఞాలను తొలగించే ఆదిదేవుని పండుగను ప్రతీ ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని వొడితల ప్రణవ్ ఆకాంక్షించారు.


