26-08-2025 NORMAL NEWS 10:55 PM
swarnodayam.com
Telugu Daily News
26-08-2025 10:55 PM By Mandala Yadagiri

ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేసిన బల్దియా… – గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మట్టి విగ్రహాల పంపిణీ చేసిన మాజీ చైర్పర్సన్

ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేసిన బల్దియా… – గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మట్టి విగ్రహాల పంపిణీ చేసిన మాజీ చైర్పర్సన్
IMG-20250826-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (SFD) ఆధ్వర్యంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకులను తయారుచేసి ఉచితంగా పంపిణీ జరిపారు. ఈ సందర్భంగా SFD స్టేట్ కో కన్వీనర్ సందీప్ మాట్లాడుతూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడకూడదని మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SFD కో కన్వీనర్ రావణవేణి రోహిత్ నేతాజీ, నగర కార్యదర్శి కొయ్యాల అంజి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్, సంయుక్త కార్యదర్శిలు కిరణ్, అభి, వినయ్ ఉపాధ్యక్షులు బన్నీ, రంజిత్, దేవేందర్, శ్రీశాంత్, చిన్న శివ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మట్టి విగ్రహాల పంపిణీ
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మంగళవారం హుజరాబాద్ పట్టణంలో సీడ్ గణపతిలను హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందే రాధిక, నాయకులు గందె శ్రీనివాస్ లు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సాంప్రదాయం ప్రకారం గణేశుని పూజించడం ధర్మమని, పర్యావరణానికి దెబ్బ తలగకుండా మట్టి గణపతిలను ప్రతిష్టించి పూజించడం ప్రయోజనకరమని అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అందరూ సీడ్ దళపతిలనే ప్రతిష్టించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కల్లెపు మోహన్ రావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్…

Oplus_16908288

మట్టి వినాయకులను తయారు చేస్తున్న ఏబీవీపీ నాయకులు…

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

మట్టి గణపతి లతో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!