Social 1080×1350 • Multi-page
28-08-2025 BREAKING NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News

చల్లూరు గ్రామంలో ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. – ఐదుగురు పరార్!

చల్లూరు గ్రామంలో ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. – ఐదుగురు పరార్!
IMG-20250828-WA0114

స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ శివారులోని వాటర్‌ట్యాంక్ వద్ద పేకాట ఆడుతున్న గ్యాంగ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 10 మందిలో ఐదుగురిని పట్టుకుని, వీణవంక ఎస్సైకి అప్పగించారు. అరెస్టయిన వారు మాడ ప్రభాకర్, సంపత్ రెడ్డి, శివరాత్రి తిరుపతి, మిడిదొడ్డి మొండయ్య, సముద్రాల బాబు. కాగా బోడసు రాయమల్లు, రామాంజనేయులు, కుమార్, కొమరయ్య, మరో తిరుపతి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,020 నగదు, నాలుగు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!